కోడుమూరు: సినీ ప్రముఖులను కలిసి ఆలయ సందర్శనకు ఆహ్వానించిన కోడుమూరు శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి
ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, నటి లయ, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి లను కోడుమూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆదివారం ఉదయం కలిశారు. సుమారు రూ.15 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న పంచాయతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన చేయాలని కోరారు. దీంతో త్వరలోనే ఆలయ సందర్శనకు విచ్చేస్తామని సినీ ప్రముఖులు హామీ ఇచ్చారని చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.