జహీరాబాద్: ముల్కన్ పాడు గ్రామంలో పత్తి చేనులో వేస్తూ 16 మేకల మృతి
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముల్కన్ పాడు గ్రామంలో 16 మేకలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేతరి సంజీవ్ అనే వ్యక్తి మేకలను మేమెందుకు గ్రామ శివారుకు తరలించారు. పత్తి చేనులో మేత మేస్తూ సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు మేకలు ఒకటి ఒకటి కిందపడుతూ 16 మేకలు మృతి చెందినట్లు తెలిసింది. ప్రమాదంలో దాదాపు రెండున్నర లక్షల నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయారు. సంఘటన స్థలాన్ని మండల రెవెన్యూ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు.