సంగారెడ్డి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. న్యాశవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం సంగారెడ్డి లోని బాలుర నూతన ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య హాజరై మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పేర్కొన్నారు. ఉచిత న్యాయ సహాయం కొరకు విద్యార్థులు ఉపాధ్యాయులు సంగారెడ్డి పట్టణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.