చండూరు: నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు: రాపోలు ప్రభాకర్
నల్గొండ జిల్లా, చండూరు పట్టణ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘం నాయకుడు రాపోలు ప్రభాకర్ మాట్లాడుతూ.. నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చేయటని ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ గళాన్ని వినిపించారు.