రాప్తాడు నియోజకవర్గం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలను సందర్శించి కార్తీక దీపాలను వెలిగించిన మహిళా భక్తులు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజవర్గంలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లో శివాలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష సంఖ్యలో మహిళలు శివుని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా రామగిరి శివాలయం నిర్వాహకుడు భీమయ్య స్వామి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష సంఖ్యలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి శివుని దర్శించుకుని పూజలు నిర్వహించారని రామగిరి మండల కేంద్రంలో శివాలయం ఆలయ నిర్వాహకుడు ప్రధాన పూజారి భీమయ్య స్వామి పేర్కొన్నారు.