ఆళ్లగడ్డ: ఓబులంపల్లి లో పొద్దు తిరుగుడు విత్తనాలు చోరీకి యత్నం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లి లో అర్ధరాత్రి ధాన్యం దొంగతనాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు, ప్లాట్ల వద్ద ఆరబోసిన పొద్దు తిరుగుడు విత్తనాలను సంచిలో నింపుకొని పారిపోతున్న వ్యక్తులను పట్టుకున్నారు, గత వారం రోజులుగా మినుము బస్తాలు మాయమవుతుండడంతో రైతులు అప్రమత్తమయ్యారు, పట్టుబడ్డ నిందితులపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పంట ఉత్పత్తులను అపహరిస్తున్న ముఠా నుంచి రక్షణ కల్పించాలని రైతుల కోరుతున్నారు