మదనపల్లెలో దారుణం.
భార్య యాసిడ్ తాగించి హత్యా ప్రయత్నం చేసిన భర్త .చికిత్స పొందుతూ భార్య మృతి.
అన్నమయ్య జిల్లా.మదనపల్లె పట్టణం శేషప్ప తోటలో దారుణం ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈనెల ఆరో తేదీన భార్య శశికళ ఇంట్లో ఒంటరిగా ఉండగా భర్త కె.వి.రమణ ,మరిది కలిసి శశికళ ను యాసిడ్ తపించి హత్యా చేయడానికి ప్రయత్నించారు. శశికళ కేకలు విన్న స్థానికులు వెంటనే గమనించి శశికళను ఏరియా ఆసుపత్రికి తరలించారు. శశికళ పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ శశికళ సోమవారం మృతి చెందారు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.