14 నెలల్లో రూ.5.40 కోట్ల cmrf చెక్కులు పంపిణీ: mla ఇంటురి నాగేశ్వర రావు..
కందుకూరు tdp ఆఫీసులో ఆదివారం mla ఇంటూరి నాగేశ్వరరావు 41 మంది లబ్ధిదారులకు రూ.23.70 లక్షల cmrf చెక్కులను పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలోనే కందుకూరు నియోజకవర్గంలో 667 మందికి రూ.5.40 కోట్లు cmrf చెక్కులను అందించామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది.