బనగానపల్లె: కొలిమిగుండ్ల లో వంట గ్యాస్ కు తప్పని తిప్పలు
పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా వినియోగదారులకు వంటగ్యాస్ తిప్పలు తప్పడం లేదు. కొలిమిగుండ్ల మండలంలో 13 వేలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా, సకాలంలో వంట గ్యాస్ అందడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గ్యాస్ బుక్ చేసుకుని 25 రోజులు గడిచినా గ్యాస్ బండ ఇంటికి రాకపోవడంతో కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వంటగ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలకుండా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు