పలమనేరు: మానవత్వం చాటుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, పేద మహిళ భర్తకు దహన సంస్కారాలు నిర్వహణ.
పలమనేరు: పట్టణంలోని కె.వి. స్ట్రీట్ లో నివసిస్తున్న ఒక మహిళ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తన భర్తకు దహన సంస్కారాలు నిర్వహించలేని స్థితిలో పడింది. సహాయం కోసం ఆమె హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థను ఆశ్రయించగా, సంస్థ ప్రతినిధులు వెంటనే స్పందించి మానవత్వం చాటుకున్నారు. మహిళ భర్తకు కావాల్సిన ఏర్పాట్లు చేసి దహన సంస్కారాలను నిర్వహించారు. పేద ప్రజలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకుంది. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు శివ, షణ్ముక్ తేజ్, యల్లంపల్లి నరేంద్ర, అభినవ్, ఫర్హాన్ ,నవీన్ పాల్గొన్నారు.