ఆటో నిండా స్టూడెంట్స్, డ్రైవర్ ని మందలించిన నెల్లూరు కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ 1వ డివిజన్ నవలాకుల తోట ప్రాంతంలో శుక్రవారం పర్యటిస్తున్న సందర్భంలో అధిక సంఖ్యలో స్కూలు విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటోను గమనించి ఆపి డ్రైవర్ తో మాట్లాడారు. వర్షాకాలం నేపధ్యంలో రోడ్లన్నీ తడిసి జారుడుగా ఉండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా పరిమితికి మించి వాహనంలో ప్రయాణికులను తీసుకెళ్లడం ప్రమాదమని కమిషనర్ వారించారు. అందులోనూ స్కూలు పిల్లలను తరలించే సందర్భంలో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది