ఒంగోలులో శ్రీ షిరిడి సాయిబాబా ప్రచార కమిటీ సభ్యులు మీడియా సమావేశం, సాయిబాబా పై దుష్ప్రచారాన్ని చేయడానికి తీవ్ర ఆగ్రహం
Ongole Urban, Prakasam | Jun 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మంగళవారం శ్రీ శిరిడి సాయిబాబా ప్రచార కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. కొంతమంది సోషల్ మీడియాలో సాయిబాబా పై దుష్ప్రచారాన్ని చేయడానికి తీవ్రంగా ఖండించారు. సాయిబాబా ముస్లిం అని ఆయన ఆలయాలు మసీదులు అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారని దీనిని వారు తీవ్రంగా ఖండిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబా సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని ఆయన ఎంతోమందికి భోజనం పెట్టారని రోగాలు తగ్గించాలని సనాతన ధర్మాన్ని బోధించారని ఎవరైనా దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.