ఒంగోలు అర్బన్: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీకి 85 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 29, 2026
ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రజలు 85 అర్జీలు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సమర్పించినట్లు కార్యాలయం నిర్వహణ అధికారులు వెల్లడించారు. అర్జీదారులతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేరుగా మాట్లాడారని వచ్చిన అర్జీలు అన్నిటిని పరిష్కరిస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.