ఒంగోలు అర్బన్: ఒంగోలులో భారతీయ జనతా పార్టీ నాయకుల సంబరాలు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బిజెపి గెలవడంపై హర్షం
Ongole Urban, Prakasam | May 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సోమవారం బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు ముగియడం అందులో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం పై వారు ఆనందం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దాదాపు 70 సంవత్సరాలు తర్వాత మళ్లీ బిజెపి జెండా ఎగరడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పశ్చిమ బెంగాల్ కనీసం ఆడపిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.