ఆళ్లగడ్డ: కోటకందుకూరు, కృష్ణాపురం గ్రామాల్లో: ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం
నంద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలంలోని కోటకందుకూరు కృష్ణాపురం గ్రామాల్లో గురువారం సాయంత్రం వాతావరణం చల్లబడింది, ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది, ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన జనం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు, అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు