జహీరాబాద్: బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో వైభవంగా మహా మృత్యుంజయ లక్ష జప యజ్ఞం, పాల్గొన్న ఆర్డిఓ దేవుజ
సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలం బర్దిపూర్ దత్తగిరి క్షేత్రంలో లోకకళ్యాణార్థం మృత్యుంజయ లక్ష జప యజ్ఞం వైభవంగా నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజ్, సిద్ధేశ్వర నందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం గణపతి పూజ, గోపూజ, రుద్రాభిషేకం, మృత్యుంజయ యజ్ఞం, మహా మంగళహారతి కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జహీరాబాద్ ఆర్డిఓ దేవుజ హాజరై పూర్ణాహుతిలో పాల్గొని మొక్కలు చెల్లించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు ఆర్డీవో దేవుజా ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.