మహానంది క్షేత్రంలో పుష్కరిని ఆధునికరణ పనులను పరిశీలించిన ఈవో శ్రీనివాసరెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 12, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో మధ్య పుష్కరిణి ఆధునీకరణ పనులను ఆదివారం ఈవో శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పురాతన పుష్కరిణి కావడంతో మెట్లు చుట్టూ ఉన్న గోడలు శిథిలావస్థకు చేరాయి. దీంతో దేవదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఈవో తెలిపారు.