బనగానపల్లె: కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి ఫైర్ అయిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
ఇటీవలే కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఆమె బనగానపల్లెలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రవీంద్రారెడ్డి బే షరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు