మంత్రాలయం:కూటమి ప్రభుత్వం ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని బీసీ సంక్షేమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు వడ్డే మాదప్ప డిమాండ్ చేశారు. శనివారం మంత్రాలయం మండల కేంద్రం లోని రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం నిధులు సమృద్ధిగా వచ్చి అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.