ఒంగోలు అర్బన్: పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
Ongole Urban, Prakasam | May 25, 2026
పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు దర్యాఫ్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో సోమవారం జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రేవ్ & నాన్, దొంగతనం, స్నాచింగ్, మిస్సింగ్, 174 Cr.P.C,రోడ్డు ఆక్సిడెంట్ కేసులపై మరియు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కేసుల ఛేదన, పరిష్కారం, నేర నియంత్రణకు సంబంధించిన పలు సూచనలు చేశారు