మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ రోనాంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు. వివేకానందుని విగ్రహానికి ఆయన పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆశయాలు నేటి యువత మార్గదర్శకమని జ్ఞానం ఆత్మవిశ్వాసం సేవాభావంతో సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.