బేతంచెర్లలో వ్యక్తి అదృశ్యం, మిస్సింగ్ కేసు నమోదు
Dhone, Nandyal | May 1, 2025 బేతంచెర్ల పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు గురువారం రాత్రి తెలిపారు. ఉలిందకొండకు చెందిన షేక్ మాసూం బాష బైటి పేటలో ఉంటున్నాడని, మార్చి 13న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని, భార్య రేష్మ బేతంచెర్ల పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపాల్ తెలిపారు.