డోన్: బేతంచెర్ల లో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య
Dhone, Nandyal | Apr 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం సంజీవనగర్కు చెందిన వడ్డే సురేశ్ (38) ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. మంగళవారం రాత్రి దంపతుల మధ్య తలెత్తిన గృహకలహాల వల్ల మనస్థాపం చెంది ఆయన ఈ దారుణానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.