కడప: మొంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైనా నేపథ్యంలో ఆందోళన అవసరం లేదు: ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్
Kadapa, YSR | Oct 27, 2025 మొంథా తుఫాన్ ప్రభావం ప్రారంభం అయిన నేపథ్యంలో.. ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి విఫత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులకు సూచించారు.  మొంథా తుఫాను పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, సంసిద్ధతపై.. జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తగు సూచనలు చేశారు.