పామూరు: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని జన విజ్ఞాన వేదిక నాయకులు పామూరులో ఆదివారం అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలను స్థానికులకు తెలిపారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు గుడ్డ సంచులను స్థానికులకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులను నిషేధించి జనపనార లేదా గుడ్డ సంచులను వాడాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు.