నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో బుధవారం హెచ్ జి ఫౌండేషన్ సహకారంతో కౌమార బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, జీవన నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. శిక్షకురాలు డాక్టర్ ధనలక్ష్మి బాలికల శరీరంలో వయసుతో పాటు జరిగే మార్పులు, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాశంకర్, శ్రీదేవి, డాక్టర్లు రమ్య, శిరీష, సంస్థ ప్రతినిధులు ప్రమీల, గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.