మందు బాబులకు అడ్డాగా ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారింది, మందుబాబులు తప్ప తాగి బీర్లు సీసాలు పగలగొడుతున్నారు, విద్యార్థులు ఉదయం వాకింగ్ వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం ఉన్న పోలీసులు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరారు.