కొత్తగూడెం: GO 64 ను రద్దు చేయాలని టైం స్కేల్ ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన కార్మికులు
డైలీ వేజ్ వర్కర్ల జీతాలు తగ్గించే జీవో 64 ను ఔట్సోర్సింగ్ వర్కర్ల జీతాలు తగ్గించే జీవో 527 ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత మంత్రులు,ముఖ్య మంత్రి దృష్టికి తక్షణమే తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఐటియు నాయకులు దొడ్డ రవికుమార్,సత్య మాట్లాడుతూ ఐదు రోజులుగా రోజులుగా జరుగుతున్న డైలీ వేజ్ వర్కర్ల మరియు ఔట్సోర్సింగ్ వర్కర్ల నిరవధికసమ్మె చేస్తున్నారన్నారు