కర్నూలు: ఆశాలకు వేతనాలు పెంచి పనిభారం తగ్గించే వరకు పోరాటాలకు సిద్ధం కావాలి:ఆశా వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధన లక్ష్మి
ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటీయు కర్నూలు జిల్లా ఐదవ మహాసభలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు కెకె భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికె. ధనలక్ష్మి హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లకు చట్టబద్ధకమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నేషన ల్ హెల్త్ మిషన్ ఏర్పడి 20 సం వత్సరాలు అవుతున్న వారిని కార్మికులుగా గుర్తించడం లేదని వారు విమర్శించారు.