డోన్: బేతంచెర్ల టౌన్ విద్యుత్ శాఖ ఏఈ గా వీరప్రసాద్
Dhone, Nandyal | Jun 24, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల టౌన్ విద్యుత్ శాఖ ఏఈగా వీర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఏఈ వీర ప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు, పారిశ్రామికవేత్తలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు