యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి భజన బృందాలు భజన పోటీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మూడు గంటల వరకు భజన పోటీలు నిర్వహించారు. భజన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.