ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి ఫీజు వివరాలు అడిగి తెలుసుకున్న విద్యార్థి జేఏసీ నాయకులు
Ongole Urban, Prakasam | Jun 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు మంగళవారం విద్యార్థి జెఎసి సంఘాల నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్న ఫీజు వివరాలు విద్యా సామాగ్రి ఫీజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఫీజులు వసూలు చేయాలని అంతకుమించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జేఏసీ నాయకులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు.