సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు మండలం కాసాల దక్షిణ ఇండియా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా పస్కా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘస్తులు అందరు కలిసి చర్చి నుండి గ్రామ శివారులో గల పచ్చని పొలాలకు నూతన వస్త్రాలు ధరించి పిల్లలు పెద్దలు తరలివెళ్లి ఘనంగా పస్క పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పస్కా పండుగను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాసాల చర్చి నిర్వాహకులు గ్రామస్తులు పాల్గొన్నారు.