నంద్యాల జిల్లా బేతంచెర్లలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం 3 గంటలకు హిందూ ధర్మ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరుకావాలని హిందూ సోదరులకు నిర్వహణ సమితి శనివారంపిలుపునిచ్చింది. శంకరానంద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరవుతారని సమితి అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, మారుతి శర్మ, మధుమోహన్ రెడ్డి పేర్కొన్నారు.