ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రధాన ఆలయ అర్చకులు రమణయ్య దీక్షితులు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ గీతాలను ఆలపిస్తూ శ్రీరాముడు ఆంజనేయస్వామిని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.