సిర్పూర్ టి: లోనవెళ్లి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేసిన డాక్టర్ నవత
సిర్పూర్ టి మండలం లోన వెళ్లి గ్రామంలో డాక్టర్ నవత ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామస్తులకు ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి రక్త నమోనాలు సేకరించి పరీక్షల అనంతరం మందులను అందిస్తామని డాక్టర్ నవత అన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రమైన నీరు, వేడి పదార్థాలను తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు,