నంద్యాల అర్బన్: మహానంది ఆలయంలో భక్తులు పోగొట్టుకున్న బంగారు ఉంగరం, తిరిగి అప్పగించిన అధికారులు
Nandyal Urban, Nandyal | Apr 5, 2026
నంద్యాల జిల్లా మహానందీశ్వర స్వామి దర్శనార్థం బెస్తవారిపేటకు చెందిన నాగరాజు ఆదివారం మహానందికి వచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు కోనేరులోకి వెళ్లారు. బయటికి వచ్చిన ఆయన తన వేలికి ఉన్న మూడు గ్రాముల బంగారు ఉంగరం కనిపించకపోవడం గుర్తించి వెంటనే స్థానిక హోంగార్డు నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది మేకల మూగన్న ద్వారా వెతికించి ఆలయ సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి చేతుల మీదుగా అందజేశారు