డోన్: ఉత్తమ కొరియోగ్రాఫర్ గా సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డోన్ మండల వాసి
Dhone, Nandyal | May 6, 2026 హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన టాలీవుడ్ దాసరి ఫిలిం అవార్డ్స్ డోన్ మండలం రామదుర్గం గ్రామవాసి ఎంపీ చరణ్ అవార్డు అందుకున్నారు.ఉత్తమ కొరియోగ్రాఫర్గా సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. చిన్న గ్రామం నుంచి పెద్ద వేదిక దాకా కొరియోగ్రాఫర్గా ఆయన చేసిన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుపుతుందని గ్రామ ప్రజలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.