కడప: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిఎంఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
Kadapa, YSR | Sep 16, 2025 జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల GMR ఇంగ్లీష్ మీడియం స్కూల్ యందు నార్కోటిక్ సెల్ మరియు ఈగల్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్దులకు “ *డ్రగ్స్ వద్దు బ్రో”* కార్యక్రమమును ఈగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో మత్తు పదార్థాల వాడకంతో కలిగే శారీరక, మానసిక, సమస్యలను వివరించి, వాటిని వాడిన, కలిగిన, రవాణా చేసిన, కొనిన లేదా విక్రయించిన వారికి చట్టంలో విధించే శిక్షలను వివరిస్తూ, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని వారు చదువు పట్ల శ్రద్ధ చూపి మంచి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు.