కడప: కడప విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Sep 25, 2025 కడప విమానాశ్రయ అభివృద్ధిలో బాగంగా నిబంధనలకు లోబడి కడప ఎయిర్ పోర్ట్ నూతన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని.. జిల్లా కలెక్టర్, ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాల్ లో.. జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్, తోకలిసి.. కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్, ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ డా. శ్రీధర్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సేఫ్టీ, సెక్యురిటి కు సంబంధించిన పలు విషయాలను, ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందిస్తుందన్నారు.