కావలి: కావలిలో 'చెత్తపై సమరం' ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్...
కావలి 39వ వార్డును మోడల్ వార్డుగా ఎంపిక చేసి వార్డులో 'చెత్తపై సమరం' కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. వార్డులో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి 3 రకాల చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఇక నుంచి వార్డులలో మైక్రో ప్రణాళిక సిద్ధం చేసి చెత్తను సేకరించేందుకు ఏ సమయంలో వస్తారో ముందుగానే తెలియజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది.