డోన్: బేతంచెర్ల మద్దిలేటి స్వామి ఆలయానికి మరో రోడ్డును ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే కు ఈవో వినతి
Dhone, Nandyal | May 23, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో రోడ్డు ఏర్పాటు చేయాలని ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి విన్నవించారు. శుక్ర, శనివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో తిరిగి వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్తో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. అదనపు రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.