నంద్యాల అర్బన్: నంద్యాలలో అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన
Nandyal Urban, Nandyal | May 30, 2026
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సాంస్కృతిక శాఖ, కళారాధన ఆధ్వర్యంలో నంద్యాలలో నెల రోజులుగా జరిగిన లలిత కళల వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. 25 ఏళ్లుగా ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డా. మధుసూదన్ రావు, డా.రవికృష్ణ తెలిపారు. ముగింపు వేడుకల్లో శిక్షణ పొందిన బాలబాలికలు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.