ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : వ్యక్తిని ఢీ కొట్టి వెళ్లిన లారీ, బైకులతో లారీని వెంబడించి పోలీసుల సహాయంతో స్టేషన్ కు తరలించిన లారీ.
ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరవక ముందే ఆరేకల్లో మరో ప్రమాదం జరిగింది.రోడ్డు పక్కనున్న జయ్యప్పను మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఢీకొట్టి ఆపకుండా వెళ్లాడు. స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా వారిని కూడా ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు బైకులతో లారీని వెంబడించి పోలీసుల సహాయంతో ఎమ్మిగనూరులో పట్టుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయప్పను ఆసుపత్రికి తరలించారు.