కావలి: బోరుకు మరమ్మతులు చేపట్టిన అధికారులు
బోగోలు చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటికలో గత కొంతకాలంగా చేతి పంపు బోరు చెడి పోయి ఉంది. కర్మకాండలు నిర్వహించేటప్పుడు నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి తెలియజేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు బోగోలు ఎంపీడివో, స్థానిక నాయకులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేతి పంపు బోరుకు మరమ్మతులు చేయించారు.