మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయంలో చైత్రమాసం పౌర్ణమి మహా పర్వదినం సందర్భంగా ఘనంగా చండీ హోమం
ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయంలో చైత్ర మాసం పౌర్ణమి మహపర్వదినం పురస్కరించుకుని మంగళవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, మండపారాదన అనంతరం చండీఐహోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు.ప్రతి నెలా పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండిహోమం నిర్వహిస్తారు. 120 మంది భక్తులు చండిహోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు.