పలమనేరు: బైరెడ్డిపల్లి: మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన, 26 మంది చికిత్సలకు ఎంపీక
బైరెడ్డిపల్లి: జడ్ పి హైస్కూల్ నందు చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిభిరం జరపడమైనది. ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు హాజరయ్యారు. కంటి శస్ర్తచికిత్సలకు 26మంది ఎంపికయ్యారు. ఇంతకు మునుపు కంటిశస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలు అందించారు. కంటి శస్త్ర చికిత్సలకు ఎంపికయిన వారికి ప్రఖ్యాతి గాంచిన చెన్నె శంకర నేత్రాలయ హాస్పిటల్ నందుఉచిత కంటి శస్త్త చికిత్సలు చేయడం జరుగుతుంది. వీరందరికి ఉచితప్రయాణం ,బోజనం,వసతి,మందులు అందజేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో శంకర్ నేత్రాలయ చెందిన డాక్టర్లు పాల్గొన్నారు.