గుంతకల్లు: వైసీపీ నేతను హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి
అనంతపురం జిల్లా పామిడి మండలంలోని కాళాపురం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్, యువ నాయకుడు దేవన సతీష్ రెడ్డిని దారుణంగా హతమార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి డిమాండ్ చేశారు. సతీష్ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి గురువారం పామిడి మండలం జి.కొట్టాల గ్రామానికి వెళ్లి సతీష్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.