జూలూరుపాడు: తాగునీటి కష్టాలతో ఇబ్బందులు పడుతున్నామని జూలూరుపాడు మండల పరిధిలో గుండెపుడి గ్రామస్తులు ఆవేదన
జూలూరుపాడు మండల పరిధిలోని గుండిపూడి గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులైను పగిలిపోవడంతో నీటి సరఫరా జరగడంలేదని, దీంతో నీటి కోసం అల్లాడిపోతున్నామని శనివారం గ్రామస్తులు తెలిపారు. చేతిపంపుల్లో నుంచి మురికినీరు వస్తుందని ఆ నీటిని తాగి తాము ఎలా బ్రతకాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం పైపులైన్ మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయిందని, అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు