అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా కోలాటలాడిన జిల్లా కలెక్టర్
బతుకమ్మ వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నరు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ లో శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ముందుగా అదనపు కలెక్టర్ శ్యామల దేవి, తో కలిసి బతుకమ్మ కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళ ఉద్యోగుల తో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ, కోలాటలాడుతూ సందడి చేశారు.